టీవీ 9 : ఇక నుంచి ప్రతీ ఉదయం రెట్టింపు ఉత్సాహంగా.!

Published on Feb 24, 2023 3:17 pm IST


మన తెలుగు బుల్లితెర వద్ద వార్తా వాహికలో ఎన్నో ఏళ్ల నుంచి టాప్ ఛానెల్స్ ఒకటిగా ఉన్న ప్రముఖ ఛానెల్ టీవీ 9 కోసం ప్రత్యేకమ్హా పరిచయం చెయ్యక్కర్లేదు. వార్తలతో తెలుగు రాష్ట్రాల ప్రజలకి సమాచారాన్ని అందించే టీవీ 9 ఇప్పుడు వీక్షకుల ఉదయాన్ని మరింత ఉత్సాహంగా మార్చేందుకు తాజాగా మార్నింగ్‌ ఎక్స్‌క్లూజివ్‌ ప్రోగ్రామ్స్‌తో టీవీ9 ఛానల్ మీ ముందుకు వచ్చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఇంట్రెస్టింగ్ పోగ్రామ్స్‌తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. మరి ప్రోగ్రామ్స్ తాలూకా వివరాలు చూసినట్టు అయితే..

ఉదయం 8 గంటలకు టాప్‌ 80..

ప్రతీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ టైమ్ కి మీ మూడ్ రిఫ్రెష్ చేసే… టాప్ 80 ట్రెండింగ్ న్యూస్. ఏపీలో ఇఛ్చాపురం నుంచి హిందూపురం వరకు… తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి నల్గొండ వరకు. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారాన్ని అందించనున్నారు. ఇక ఢిల్లీ జాతీయ రాజకీయాల నుంచి.. దక్షిణాది రాష్ట్రాల పొలిటికల్ పిక్చర్ వరకు నేషనల్‌ న్యూస్‌ అప్‌డేట్స్‌. అంతర్జాతీయ వార్తా కథనాల కోసం.. అమెరికా నుంచి లండన్ వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఆసక్తికర పరిణామాల సమాచారం అందిస్తారు. పది నిముషాల్లో పల్లె నుంచి పట్నం వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఘటనల నిర్విఘ్న వార్తా ప్రవాహాన్ని మీకు అందించనున్నారని చెప్తున్నారు.

 

ఇక ఉదయం 8.25 గంటలు – ఈటి ఎక్స్ క్లూజివ్

మన టాలీవుడ్‌ నుంచి అటు హాలీవుడ్‌ వరకు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది..? మూవీస్ నుంచి ఓటిటి వరకు లేటెస్ట్ అండ్ హాటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ ఏంటి.? లాంటి సమస్త సినీ సమాచారం, టాలీవుడ్ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, బాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్‌తో పాటు.. కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్‌లలో జరుగుతోన్న ఇంట్రెస్టింగ్‌ విషయాలతో టోటల్ సౌత్ సినిమా విశేషాలను మీకు అందించనున్నారు.అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రపంచంలో జరుగుతోన్న అప్‌డేట్స్‌ పది నిమిషాల్లో అప్డేట్ చేసే ప్లానింగ్ చేయడం విశేషం.

 

నెక్స్ట్ ఉదయం 9 గంటలకు – మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం

టీవీ 9 లో నలుగురు ప్రముఖ యాంకర్లతో లోకల్‌ టూ గ్లోబల్‌ నాన్‌ స్టాప్‌ న్యూస్‌ షో. ప్రధాన వార్తలతో పాటుగా లేటెస్ట్ అప్డేట్స్ అండ్ అప్ టు డేట్ డెలలప్‌మెంట్స్‌తో స్పెషల్‌ స్టోరీస్ ను ఈ సమయంలో ప్రసారం చేయనున్నారు.

 

ఇక ఉదయం 9.30 గంటలకు – బర్నింగ్ టాపిక్

ప్రస్తుత రాజకీయ చదరంగంలో ఏ పావును ఎవరు.. ఎటు కదుపుతున్నారు. అధికారం పక్షం ఎత్తులకు.. ప్రతిపక్షాల పై ఎత్తులు. స్టేట్ పాలిటిక్స్ టు సెంట్రల్ పాలిటిక్స్‌లో నెగ్గుతోందెవరు.. తగ్గుతోందెవరు రంగులు మారుస్తున్న రాజకీయ నాయకుల కౌంటర్లు .. ఎన్ కౌంటర్లు. ఇలాంటి ఎన్నో బర్నింగ్ పొలిటికల్ ఇష్యూస్‌ని ప్రేక్షకులకు అందించే సెటైరికల్‌ ప్రోగ్రామ్‌ లతో సమాచారం ని మరింత ఆసక్తికరంగా మలచి ఆడియెన్స్ కి అందించనున్నారు.

సంబంధిత సమాచారం :