టాక్..”మహేష్ 28″ కి అదే టైటిల్ ఫిక్స్.?

Published on May 11, 2023 3:00 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజ హెగ్దే మరియు శ్రీ లీల హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి వీరి నుంచి వస్తున్నా హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో మరిన్ని అంచనాలు సినిమా పై నెలకొనగా గత కొన్నాళ్ల నుంచి అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో కాస్త సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే.

ఎక్కువగా అయితే “అమరావతికి అటు ఇటు” అనే కూల్ టైటిల్ ని మేకర్స్ చూస్తున్నారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ ని మేకర్స్ దాదాపు కన్ఫర్మ్ చేసేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇదే టైటిల్ ఫిక్స్ చేసారో లేక లాస్ట్ మినిట్ లో కొత్త టైటిల్ ఏమన్నా మారుతుందేమో తెలియాలి అంటే ఈ మే లాస్ట్ వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :