లేటెస్ట్..పవన్, హరీష్ ల సాలిడ్ ప్రాజెక్ట్ కి ఈ టైటిల్ ఫిక్స్.?

Published on Sep 9, 2021 7:10 am IST


టాలీవుడ్ మంచి క్రేజ్ ఉన్న పలు క్రేజీ కాంబోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ ల కాంబో కూడా ఒకటి. గబ్బర్ సింగ్ నుంచి స్టార్ట్ అయ్యిన వీరి జర్నీ ఇప్పుడు మళ్లీ మొదలు కానుండడంతో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విషయంలో అప్డేట్స్ అప్ టు డేట్ ఉంటాయి అని హరీష్ ప్రామిస్ చేశారు. కానీ ఇంత సడెన్ సడెన్ గా వచ్చేస్తాయి అని అభిమానులు అనుకోలేదు..

నిన్న సాయంత్రం ఈరోజు ఓ అదిరే అప్డేట్ రానుంది అని రాత్రికి ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేస్తున్నామని ఊహించని రీతిలో అప్డేట్ ఇచ్చేసారు. మరి ఈ సాలిడ్ కాంబోకి టైటిల్ ఏమి ఫిక్స్ అయ్యింది అన్నది ఇప్పుడు తెలుస్తుంది.. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రానికి “భవదీయుడు భగత్ సింగ్” అనే పవర్ ఫుల్ టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్టుగా సమాచారం.. మరి టైటిల్ ఇదేనా కాదా అన్నది తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు ఆగక తప్పదు..

సంబంధిత సమాచారం :