షారుఖ్, అట్లీ బిగ్ ప్రాజెక్ట్ లో ఈ టాలీవుడ్ స్టార్ హీరో?

Published on Sep 8, 2021 7:05 am IST


ఇటీవల ఇండియన్ సినిమా దగ్గర స్టార్ట్ అయ్యిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ యంగ్ అండ్ స్టార్ దర్శకుడు అట్లీ ల కాంబోలో ప్లాన్ చేసిన ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి మొన్ననే పూణే లో స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం పాన్ ఇండియన్ వైడ్ భారీ అంచనాలనే నెలకొల్పుకుంది. అయితే ఈ భారీ చిత్రం లో మన టాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని ఊహించని బజ్ ఒకటి బయటకి వచ్చింది.

ఆ హీరో మరెవరో కాదు మల్టీస్టారర్ చిత్రాలకు బెటర్ ఛాయిస్ గా నిలిచే మన టాలీవుడ్ హల్క్ రాణా దగ్గుబాటినే.. మరి ఇప్పుడు రాణా కూడా ఈ సినిమాలో ఉన్నాడంటూ వార్తలు వైరల్ అవుతుండగా రాణా రోల్ ఈ చిత్రంలో వెరీ స్పెషల్ గా కనిపించనుంది అని తెలుస్తోంది. అయితే ఇది జస్ట్ సినీ వర్గాలు వరకు టాక్ మాత్రమే కానీ ఇంకా రాణాని సంప్రదించినట్టుగా టాక్ లేదు. షారుఖ్ కి ప్రతినాయక పాత్రలో రాణా అయితే కరెక్ట్ గా సెట్టవుతాడాని మేకర్స్ అభిప్రాయం అన్నట్టుగా దీనిపై బజ్.. మరి ఇది ఎంతవరకు నిజమో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :