“వారిసు” ఫస్ట్ ఛాయిస్..ఇద్దరు టాలీవుడ్ స్టార్స్.!

“వారిసు” ఫస్ట్ ఛాయిస్..ఇద్దరు టాలీవుడ్ స్టార్స్.!

Published on Dec 16, 2022 11:00 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ సహా కోలీవుడ్ సినిమా దగ్గర మంచి అంచనాలు నెలకొల్పుకున్న చిత్రం “వారసు” కోసం అందరికీ తెలిసిందే. ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కాబోతుండగా ఇప్పుడు రిలీజ్ అంశం అంతకంతకూ ఆసక్తిగా మారుతుంది. ఇక లేటెస్ట్ గా నిర్మాత దిల్ రాజు కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి.

అయితే ఈ సినిమా విజయ్ దగ్గరకి వెళ్లడానికన్నా ముందు అయితే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి చెప్పడం జరిగింది అని కానీ అప్పుడు మహేష్ బిజీగా ఉండడం ఆ తర్వాత ఇదే కథని రామ్ చరణ్ కి కూడా చెప్పడం జరిగింది అని కానీ చరణ్ కూడా అందులోని మా బ్యానర్ లోనే ఇంకో సినిమా చేస్తుండడంతో అది కూడా అవ్వలేదని కానీ ఫైనల్ గా విజయ్ కి ఓ అరగంట నరేట్ చేయగా తాను వెంటనే ఓకే చెప్పడంతో అయితే ఈ చిత్రం సాధ్యం అయ్యింది అని ఫస్ట్ ఛాయిస్ అయితే విజయ్ కాదని దిల్ రాజు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు