తారక్, బుచ్చిబాబు ప్రాజెక్ట్ కి ఈ బిగ్ మ్యూజిక్ కంపోజర్..?

Published on Feb 2, 2022 2:00 pm IST


ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒకదాన్ని మించిన ఒకటి సాలిడ్ ప్రాజెక్ట్ లతో తమ లైనప్ లను సెట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మరి ఈ లిస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఆసక్తికర సినిమాలతో హాట్ టాపిక్ గా నిలిచాడు. అయితే వీటిలో గత కొన్ని రోజులు నుంచి హాట్ టాపిక్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ మరియు లేటెస్ట్ సెన్సేషన్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో ప్లాన్ చేసిన మరో బిగ్ ప్రాజెక్ట్ లు హాట్ టాపిక్ గా నిలిచాయి.

అయితే ఇదిలా ఉండగా ఈ భారీ సినిమాపై ఇంకో ఎగ్జైటింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం గాను ఇండియాస్ టాప్ సంగీత దర్శకుల్లో ఒకరైన ఏ ఆర్ రెహమాన్ ని తీసుకున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేకపోయినా ఎలాగో ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆ గ్రాండియర్ కి తగ్గట్టుగా తీసుకున్నా ఆశ్చర్యం లేదని చెప్పాలి. కానీ దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :