ఇంట్రెస్టింగ్..అజిత్ “వలిమై” లో అసలు ఈ ట్రాకే ఉండదట..!

Published on Feb 23, 2022 3:41 pm IST


కోలీవుడ్ బిగ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ భారీ యాక్షన్ చిత్రం “వలిమై” ఇంకొక్క రోజులో భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రెజెంట్ చేయబడుతున్న ఈ సినిమాని ఏ లెవెల్లో దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించాడో ట్రైలర్ తో అంతా చూసారు.

మరి దాదాపు 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో కంప్లీట్ గా ఓ ట్రాక్ ని అయితే దర్శకుడు పెట్టనట్టు తెలుస్తుంది. మరి ఇంత పెద్ద సినిమాలో అసలు రొమాంటిక్ ట్రాక్ అనేదే ఉండదట. మొదటి నుంచి కూడా ఈ సినిమాలో హీరోయిన్ ఉందని హీరోతో పెద్దగా రొమాంటిక్ ట్రాక్ ఉన్నట్టు కూడా చూపించలేదు.

ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయ్యినట్టుగా సినీ వర్గాల్లో టాక్ బయటకు వచ్చింది. అయితే ఈ చిత్రంలో అజిత్ తో బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి కనిపిస్తుంది కానీ అది కూడా యాక్షన్ పర్పస్ మాత్రమే ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ ఎలిమెంట్ లేకుండా ఇంత పెద్ద చిత్రం ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :