“వీరసింహా రెడ్డి” లో ఈ ట్రీట్ నెక్స్ట్ లెవెల్లో.!

“వీరసింహా రెడ్డి” లో ఈ ట్రీట్ నెక్స్ట్ లెవెల్లో.!

Published on Nov 17, 2022 11:03 AM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే ఇప్పుడు శరవేగంగా అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అయితే బాలయ్య ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసే మాస్ అండ్ యాక్షన్ మూవీ లవర్స్ అంచనాలు గట్టిగానే ఉంటాయి.

మరి అందుకు తగ్గట్టే మేకర్స్ కూడా సినిమాలో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ లు చాలానే డిజైన్ చేశారట. దీనితో ఈ చిత్రం నుంచి నందమూరి ఫాన్స్ కి అఖండ తర్వాత ఎలాంటి లోటు ఉండదని తెలుస్తుంది. మరి ఈ చిత్రమో పదికి పైగా యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయట. దీనితో మాత్రం వీర సింహా రెడ్డి నుంచి మళ్ళీ చాలా కాలం తర్వాత వింటేజ్ బాలయ్యని ఫ్యాక్షన్ హీరోగా చూడడం ఖాయం అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు