“ఆచార్య” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇదేనా..?

Published on Nov 24, 2021 7:08 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ సినిమా “ఆచార్య”. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ భారీ సినిమాని నార్మల్ కంటే ఓ మెగా మల్టీస్టారర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో అనుకున్న దానికంటే ఎక్కువగా మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పాత్ర వచ్చింది. మరి ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సిద్ధ పై ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరి అదేంటో ఇప్పుడు తెలుస్తోంది. దీని ప్రకారం మేకర్స్ ఈసారి చరణ్ చేసిన సిద్ధుడి పాత్రపై టీజర్ ని రిలీజ్ చెయ్యబోతున్నారట. దానిపైనే ఈరోజు అప్డేట్ ఉండొచ్చని సినీ వర్గాల్లో టాక్. మరి అదేనా కాదా అనేది వేచి చూడాలి. ఇక చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More