లేటెస్ట్..సుధీర్ బాబు యాక్షన్ ప్రాజెక్ట్ లో ఈ వెర్సటైల్ నటుడు.!

లేటెస్ట్..సుధీర్ బాబు యాక్షన్ ప్రాజెక్ట్ లో ఈ వెర్సటైల్ నటుడు.!

Published on Sep 24, 2022 11:00 AM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాలెంటెడ్ మరియు డెడికేటెడ్ హీరోస్ లో నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా ఒకరు. మరి సుధీర్ బాబు హీరోగా ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు చేస్తుండగా వాటిలో రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఓ సాలిడ్ యాక్షన్ చిత్రం “హంట్” కూడా ఒకటి. నూతన దర్శకుడు మహేష్ సూరపనేని తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఈ సినిమా నుంచి అయితే మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని రివీల్ చేశారు.

ఈ చిత్రంలో ప్రముఖ వెర్సటైల్ నటుడు శ్రీకాంత్ నటిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి శ్రీకాంత్ పై అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేసి తాను మోహన్ భార్గవ్ అనే పాత్రలో కనిపించనున్నట్టుగా రివీల్ చేశారు. ఇక ఈ చిత్రానికి అయితే జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా భవ్య క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు