ప్రభాస్ ఆ సినిమాపై అది ఒట్టి రూమర్ మాత్రమేనట.!

Published on Apr 2, 2022 8:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న అలాగే నటించనున్న పలు భారీ సినిమాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వీటిలో అయితే ఇంకా అనౌన్స్ కావాల్సిన సినిమా ఒకటి ఉంది. అదే దర్శకుడు మారుతి తో ప్లాన్ చేసిన హారర్ అండ్ కామెడీ డ్రామా. దీనిపై కూడా ప్రభాస్ చాలా నమ్మకంగా ఉన్నాడు.

అయితే దీనిని ఒక క్విక్ ప్రాజెక్ట్ గా కంప్లీట్ చేసేయాలని ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాపై జస్ట్ ఈ రెండు మూడు రోజుల్లో ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాతో మళ్ళీ ఫ్యాన్స్ మోస్ట్ ఫేవరెట్ కాంబో అయినటువంటి ప్రభాస్ మరియు అనుష్క లు నటిస్తారని వినిపించింది.

అయితే ఇది కేవలం ఒట్టి రూమర్ మాత్రమే అని ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. అనుష్క ని సంప్రదించడం వంటివి ఏం చెయ్యలేదని ఇవన్నీ ఒట్టి ఊహాగానాలు మాత్రమే అని సినీ వర్గాలు ఇపుడు కన్ఫర్మ్ చేసాయి.

సంబంధిత సమాచారం :