“కేజీయఫ్” నిర్మాతల నుంచి ఇది ఊహించని అనౌన్స్మెంటే..!

Published on Apr 10, 2022 12:00 pm IST

మన సౌత్ ఇండియన్ సినిమా సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లలో కన్నడ ఇండస్ట్రీకి చెందిన హోంబలే ఫిల్మ్స్ వారిది కూడా ఒకటి. అయితే ఈ నిర్మాణ సంస్థకి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ రావడానికి కారణం వీరి బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఫ్రాంచైజ్ “కేజీయఫ్” సినిమాలే అని చెప్పాలి.

అయితే ఇప్పుడు వీరి నుంచి వస్తున్న “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం ఇండియన్ ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నిన్ననే మేకర్స్ వారి నుంచి ఈరోజు ఒక బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ని రివీల్ చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఇప్పుడు నిజంగా ఇది ఊహించని రేంజ్ భారీ అనౌన్సమెంట్ అని చెప్పాలి.

ఎందుకంటే వీరు మొట్ట మొదటిసారిగా ఇండియాలో ఏ నిర్మాణ సంస్థ కూడా చెయ్యని విధంగా ఒక ఐపీఎల్ టీం తో సంయుక్తంగా కలిసినట్టు అనౌన్స్ చేశారు. మరి ఆ టీం కూడా మరేదో కాదు ఐపీఎల్ లో మోస్ట్ క్రేజ్ ఉన్న టీంలలో ఒకటైన “రాయల్ చాలెంజర్స్ బెంగళూరు”. ఇది కూడా వారి ప్రాంతీయ టీం కావడంతో తాము ఈ వినూత్న ప్రయత్నానానికి తెర తీసినట్టు తెలిపారు.

అలాగే దీనిపై డిజైన్ చేసిన వీడియో కూడా మామూలుగా లేదని చెప్పాలి. కేజీయఫ్ లోని పాత్రలు అలాగే బెంగళూరు టీం లో కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ లతో సమానంగా ప్రెజెంట్ చేస్తూ దీనిని ప్రకటన చెయ్యడం అభిమానులు మరింత కేజ్రీగా ఫీల్ కాగా ఇంకో పక్క కేజీయఫ్ 2 పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :