టాక్..”సర్కారు వారి పాట”లో ఇది మరో హైలైట్ సీక్వెన్స్.!

Published on Mar 2, 2022 5:31 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లోనే మోస్ట్ స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న చిత్రం ఇది కావడంతో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఉన్నటువంటి అనేక హైలైట్స్ లో సాలిడ్ ఫైట్ సీక్వెన్స్ లు కూడా ఒకటి.

ఇప్పటికే దుబాయ్ లో ఫైట్ సీక్వెన్స్ పై అందరికీ ఒక క్లారిటీ రాగా నిన్న మహా శివరాత్రి కానుకగా మేకర్స్ రిలీజ్ చేసిన సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు. దీనితో ఇందులో ఫైట్ సీక్వెన్స్ పై మంచి ఆసక్తి ఇప్పుడు నెలకొంది. అయితే ఈ సీన్ చూస్తుంటే మేకర్స్ సినిమాలోని ప్లాన్ చేసిన గోవా బీచ్ లోని సాలిడ్ ఫైట్ సీక్వెన్స్ అన్నట్టు తెలుస్తుంది.

అలాగే ఇది కూడా ఈ సినిమాలో మరో హైలైట్ ఫైట్ సీక్వెన్స్ గా ఉంటుందని మంచి హాట్ టాపిక్ గా కూడా నడుస్తుంది. అలాగే బహుశా ఇది క్లైమాక్స్ ఫైట్ కూడా కావచ్చేమో అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి వేచి చూడాలి పెట్ల ఈ సీన్ ని ఎక్కడ పెట్టారో అనేది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :