పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ మూవీ టైటిల్ ఫైనలైజ్ వార్తల్లో నిజమెంతంటే ?

Published on May 3, 2023 8:27 pm IST


పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ మూవీ తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తం కి రీమేక్ గా రూపొందుతోంది. రాహా చెంబోలు, కేతికా శర్మ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలు పోస్తిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థల పై గ్రాండ్ గా నిర్మితం అవుతున్న ఈ మూవీకి సంబంధించి టైటిల్స్ కొన్ని ఇటీవల కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ మూవీకి దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ ఫిక్స్ చేసిందని కూడా న్యూస్ వైరల్ అవుతోంది. అయితే తమ మూవీకి టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదని, ఫిక్స్ చేసిన అనంతరం అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం అని, అప్పటి వరకు ఇటువంటి ప్రచారాలు నమ్మవద్దని యూనిట్ వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని జులై 28న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :