మాస్ మహారాజ్ “ఖిలాడి” పై బ్యాలన్స్ ఇవే.!

Published on Sep 25, 2021 11:00 am IST

మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ తన “క్రాక్” సినిమాతో భారీ హిట్ ఇచ్చి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. మరి ఈ సినిమా ఇచ్చిన హిట్ కిక్ నుంచి వెంటనే మరిన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి బిజీ అయ్యాడు. వీటిలో దర్శకుడు రమేష్ వర్మతో ప్లాన్ చేసిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఖిలాడి” కూడా ఒకటి. రవితేజ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో అంతకు మించిన యాక్షన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

మరి ఇదిలా ఉండగా నిన్నటితో ఈ సినిమా టాకీ పార్ట్ షూట్ అంతా కంప్లీట్ కాగా మరి మిగతా షూట్ పై అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇంకా రెండు పాటల తాలూకా షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ రెండు రోల్స్ లో కనిపించనుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :