టాక్..”రాధే శ్యామ్” నుంచి నెక్స్ట్ అప్డేట్ ఇదేనా.?

Published on Feb 19, 2022 3:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు రాదాయే కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కానున్న సంగతి కూడా తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి కూడా తక్కువ సమయమే ఉండడంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ దీనిపై వినిపిస్తుంది. ఈ సినిమా నుంచి నెక్స్ట్ వచ్చే అప్డేట్ బహుశా మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ కోసం అన్నట్టు తెలుస్తుంది. మరి ఇదెప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మొత్తం నలుగురు సంగీత దర్శకులు జస్టిన్ ప్రభాకర్, మనన్ భరద్వాజ్, మిథున్ మరియు థమన్ లు సంగీతం అందివ్వగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :