“సలార్” మాస్ క్రేజ్..సినిమాపై హైప్ కి ఇదే నిదర్శనం.!

Published on May 18, 2022 12:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వాటిలో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా “సలార్” ఒకటి. అయితే ప్రభాస్ నుంచి ఇంకా రాధే శ్యామ్ రిలీజ్ కాకముందు అలాగే ఆదిపురుష్ కూడా లైన్ లో ఉన్నప్పటికీ మధ్యలో అనౌన్స్ అయ్యిన ఈ చిత్రం మొదటి నుంచే సెన్సేషన్ ని నమోదు చేసింది.

ప్రభాస్ నుంచి ఒక పర్ఫెక్ట్ మాస్ సినిమాగా దీన్ని ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యోపోయారు. అందుకే ఆ రెండు సినిమాల కంటే ఎక్కువగా దీని కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అది ఎంతవరకు నిజమో ఆ హైప్ రియలిస్టిక్ గా ఏ రేంజ్ లో ఉందో అనేది మాత్రం నిన్న చూపించారని చెప్పాలి.

తాజాగా ఈ సినిమా అధికారిక ట్విట్టర్ ఖాతా వెరిఫై అవ్వగా దానికి కేవలం ఒక్క రోజులోనే 45 వేలకి పైగా ఫాలోవర్స్ వచ్చేసారు. ఇది ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి కూడా జరిగింది లేదు. దీని బట్టి ఈ సినిమాకి ఏ రేంజ్ లో హైప్ నెలకొందో అంతా అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా రిలీజ్ నాటికి ఆ యుఫోరియా ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :