బిగ్‌బాస్ 5: ఎట్టకేలకు ప్రియాంక సింగ్ ఎలిమినేట్..!

Published on Dec 5, 2021 1:13 am IST


బిగ్‌బాస్ 5 తెలుగు అప్పుడే చివరి దశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లోనే ఐదో సీజన్ ముగియబోతుంది. ప్రస్తుతం 13వ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వస్తున్నారన్నది ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఈ వారం షణ్ముఖ్, సన్నీ మినహా సిరి, కాజల్‌, మానస్‌, శ్రీరామచంద్ర, ప్రియాంక నామినేషన్‌లో ఉన్నారు. ఎప్పట్లాగే ముందు రోజే వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారన్న సమాచారం బయటికి వచ్చేసింది.

అయితే ఓటింగ్ పరంగా సిరి, శ్రీరామచంద్ర, మానస్, కాజల్ ముందుండగా ప్రియాంక సింగ్ వీరందరికంటే చివరి స్థానలో నిలిచిందని తెలుస్తుంది. నిజానికి గత వారమే పింకీ హౌస్ నుంచి ఎలిమినేట్‌ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ సీన్‌ మొత్తం రివర్స్‌ అయ్యి యాంకర్‌ రవిపై ఎలిమినేషన్‌ వేటు పడింది. ఈ వారం అలాంటి మ్యాజిక్ ఏదీ లేకపోవడంతో పింకీ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయినట్లు కనిపిస్తుంది. రేపటి ఎపిసోడ్‌తో ఆమె హౌస్ నుంచి బయటకి వచ్చినట్టు క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :