ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే..!

ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే..!

Published on Mar 9, 2022 10:45 PM IST


కరోనా పరిస్థితులు మెల్ల మెల్లగా చక్కబడడంతో కొద్ది రోజుల నుంచి పెద్ద, చిన్న సినిమాలన్ని వరుసపెట్టి రిలీజ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఇక వీటితో పాటు అల్రెడీ థియేటర్‌లో విడుదలైన సినిమాలు, డైరెక్ట్ డిజిటల్‌గా రిలీజ్ అవుతున్న సినిమాలు, పలు వెబ్ సిరీస్‌లు ఓటీటీలొ విడుదల కాబోతున్నాయి. అవేంటో చూద్దాం.

థియేటర్‌లో విడుదల కాబోతున్న చిత్రాలు:

1) ఈటీ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా, అరుల్ మోహన్ హీరోయిన్‌గా తెరకెకిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈటీ (ఎవరికీ తలవంచడు). సన్ పిక్చర్స్ పతాకంపై పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

2) రాధేశ్యామ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాలు:

 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో

1) ఖిలాడి – మార్చి 11
2) మారన్ – మార్చి 11

ఆహాలో

1) ఖుబూల్‌ హై – మార్చి 11

సోనీ లివ్

1) క్లాప్ – మార్చి 11

జీ 5

1) రౌడీ బాయ్స్ – మార్చి 11
2) రైడర్‌ – మార్చి 11
3) మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ షమీమ్‌ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 11

నెట్‌ప్లిక్స్

1) అవుట్‌ ల్యాండర్‌ (6వ సీజన్‌) – మార్చి 7
2) ద లాస్ట్‌ కింగ్‌డమ్‌ (5వ సీజన్) – మార్చి 9
3) ద అండీ వార్‌హోల్‌ డైరీస్‌ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 9
4) ఎ ఆడమ్‌ ప్రాజెక్ట్‌ – మార్చి 11
5) అప్‌లోడ్‌ (2వ సీజన్‌) – మార్చి 11

ఎం.ఎక్స్‌.ప్లేయర్‌

1) అనామిక – మార్చి 10

సంబంధిత సమాచారం

తాజా వార్తలు