ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కాబోతున్న చిత్రాలివే..!

Published on Apr 6, 2022 12:31 am IST

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్లుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్‌’ చిత్రం మార్చి 25న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్ మూవీని చూసేందుకు సినీప్రియులు థియేటర్ల వద్ద ఎగబడుతుండడంతో రెండో వారం కూడా ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సినిమా దూకుడుని తట్టుకుని నిలబడేందుకు సిద్దమై ఈ వారం కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. అయితే థియేటర్, ఓటీటీలో ఈ వారం విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్‌ ఓసారి చూసేద్దాం.
థియేటర్‌లో విడుదలవుతున్న చిత్రాలు:

1) గని

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం “గని”. అల్లు అరవింద్ సమర్పణలో రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీలపై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కాబోతుంది.

2) మా ఇష్టం (డేంజరస్)

సంచలన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ట్రీకీ మీడియా ప్రొడక్షన్ సమర్పణలో భారతదేశంలోనే మొట్టమొదటి లెస్బియన్/ క్రైమ్/ యాక్షన్/ లవ్ స్టోరీగా తెరకెక్కించిన చిత్రం ‘మా ఇష్టం (డేంజరస్‌)’. అప్సరారాణి, నైనా గంగూలీ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఏప్రిల్‌ 8న విడుదల కానుంది. స్వలింగ సంపర్కులైన ఇద్దరు మహిళల ప్రేమకథగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.

ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు

* ఆహా

స్టాండప్ రాహుల్ – ఏప్రిల్‌ 8 నుంచి

* అమెజాన్ ప్రైమ్‌ వీడియో

మర్డర్‌ ఇన్‌ అగోండా (హిందీ) – ఏప్రిల్ 8
నారదన్‌ (మలయాళం) – ఏప్రిల్ 8

* నెట్‌ఫ్లిక్స్‌

చస్వీ (హిందీ) – ఏప్రిల్‌ 7
ఎత్తర్కుం తునిందావన్‌ (ఈటీ, తమిళం) – ఏప్రిల్‌ 7
ఎలైట్‌ (వెబ్ సిరీస్‌) – ఏప్రిల్‌ 8
మెటల్‌ లార్డ్స్‌ (హాలీవుడ్) – ఏప్రిల్‌ 8
ది ఇన్‌బిట్విన్‌ (హాలీవుడ్) – ఏప్రిల్‌ 8

* జీ5

ఎక్‌ లవ్‌ యా (కన్నడ) – ఏప్రిల్ 8
అభయ్‌ 3 (హిందీ) – ఏప్రిల్ 8

* డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

ది కింగ్స్‌ మెన్‌ (హాలీవుడ్‌) – ఏప్రిల్ 8

 

సంబంధిత సమాచారం :