ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే..!

Published on Nov 9, 2021 6:58 am IST


కరోనా తగ్గుముఖం పట్టి సినిమా థియేటర్లు ఓపెన్ అయినప్పటి నుంచి వరుసగా ప్రతి వారం రెండు, మూడు సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తూ వస్తున్నాయి. ఇటీవల దసరా, దీపావళి పండగలకు కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద సందడి చేశాయి. అయితే ఈ వారం కూడా పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాయి .

* యంగ్‌ హీరో కార్తీకేయన్‌ హీరోగా, తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ నెల 12వ తేదిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

* యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా, దామోదర దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘పుష్పక విమానం’. ఈ నెల 12వ తేదిన ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతోంది.

* శ్రీకాంత్ హీరోగా నటించిన కేసీఆర్ బయోపిక్ ‘తెలంగాణ దేవుడు’. వడత్యా హరీష్ దర్శకత్వం వహించగా, మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా కూడా 12వ తేదీన థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

* కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ హీరోగా, శివ కార్తిక్‌ తెరకెక్కించిన చిత్రం. ‘కె3 కోటికొక్కడు’ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్‌గా ఈ నెల 12వ తేదీన రిలీజ్ కానుంది.

* దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కురుప్‌’. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ తెరక్కించిన ఈ సినిమా కూడా నవంబర్‌ 12వ తేదిన థియేటర్లలో విడుదల కానుంది.

* ఆమని, గౌతమ్‌ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ట్రిప్‌’. ఈ సినిమా కూడా నవంబరు 12వ తేదిన విడుదల కానుంది.

ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే

ఆహా – ‘3 రోజెస్’

డిస్నీ+ హాట్‌స్టార్‌

* డోప్‌ సిక్‌
* కనకం కామిని కలహం
* జంగిల్‌ క్రూయిజ్‌
* స్పెషల్‌ ఆప్స్‌
* షాంగ్‌-చి

జీ5

* అరణ్మణై 3
* స్క్వాడ్‌

నెట్‌ఫ్లిక్స్‌

* రెడ్‌నోటీస్‌

సంబంధిత సమాచారం :