ఈ వారం థియేటర్‌లో విడుదలవుతున్న చిత్రాలివే..!

Published on Mar 1, 2022 3:00 am IST


కరోనా పరిస్థితులు కాస్త చక్కబడడంతో సినిమాలన్ని వరుసపెట్టి రిలీజ్‌లు అవుతున్నాయి. ఈ క్రమంలోనే మొన్న వారం వలిమై, భీమ్లా నాయక్ వంటి సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అదే ఊపుతో ఈ వారం కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్దమయ్యాయి.
అవేంటో చూద్దాం.

1) హే సినామిక

దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “హే సినామికా”. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. మార్చి 3న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

2) ఆడవాళ్లు మీకు జోహార్లు

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదల కాబోతుంది.

3) సెబాస్టియన్‌ పిసి524

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి524’. బాలాజీ సయ్యపురెడ్డి ద‌ర్శ‌కునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 4న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :