‘మిస్టర్’ కు ఇంకో వారం రోజులు మంచిరోజులే !


మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నో ఆశలతో నటించిన చిత్రం ‘మిస్టర్’. ప్రేక్షకులు కూడా ఈ సినిమా దర్శకుడు శ్రీనువైట్లకు కమ్ బ్యాక్ చిత్రమవుతుందనుకుని సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ గత శుక్రవారం విడుదలైన ‘మిస్టర్’ మాత్రం అంచనాలకు వ్యతిరేకంగా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మంచి సినిమాల సీజన్ అయితే ఇలాంటి మిక్స్డ్ టాక్ లాంగ్ రన్ లో సినిమా వసూళ్లను దెబ్బతీస్తుంది. కానీ మిస్టర్ సినిమా ఈ ప్రమాదం నుండి కొన్ని రోజులు తప్పించుకోనుంది.

ఎందుకంటే సాధారణంగా గత నెల రోజుల్లో ప్రతి శుక్రవారం ఏదో ఒక పెద్ద సినిమా లేదా చెప్పుకోదగిన సినిమా ఒకటి రిలీజవుతూ వస్తోంది. దీంతో సినిమాల మధ్య పోటీ ఉండేది. కానీ రాబోయే శుక్రవారం ఒక ‘లంక’ మినహా మరే సినిమా విడుదలకావడంలేదు. దీంతో మిస్టర్ కు ఈ పోటీ భాధ తప్పింది. అలాగే ప్రస్తుతం థియేటర్లలో కూడా ‘మిస్టర్’ తో పాటు విడుదలైన ‘శివలింగ’ మినహా మరో కొత్త చిత్రం లేదు. ఏమైనా పోటీ అంటూ ఉంటే ఈ సినిమాతోనే ఉండాలి. కాబట్టి వరుణ్ – శ్రీను వైట్లల సినిమా ‘శివలింగ’ను తట్టుకుంటే ‘బాహుబలి-2’ రిలీజయ్యే వరకు అన్నిరోజులు మంచి రోజులే అవుతాయి.