ఈ వారాంతం సమంతదే..!

ఈ వారాంతం సమంతదే..!

Published on Nov 12, 2022 9:00 AM IST

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన మరో మంచి చిత్రం స్టార్ హీరోయిన్ సమంత నటించినటువంటి అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “యశోద”. దర్శకులు హరి మరియు హరీష్ లు తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ పాజిటివ్ టాక్ ని మొదటి షో నుంచే అందుకొని అదరగొట్టింది. ఇక నెమ్మది మొదటి ఆట తర్వాత నుంచి మరింత మంది జనం సినిమాకి లైన్ కడుతుండగా వసూళ్లు ఫస్ట్ డే మెరుగ్గా రిజిస్టర్ కానున్నట్టు ట్రేడ్ వర్గాలు కన్ఫర్మ్ చేశారు.

ఇక దీనితో మరో సినిమాలు పెద్దగా లేవు కాబట్టి ఈ వారాంతం అయితే డెఫినెట్ గా సమంతదే అని చెప్పొచ్చు. తన నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా కూడా ఇది కావడంతో ఫ్యాన్స్ కి కూడా మంచి ట్రీట్ లా ఇది మారింది. మరి ఫైనల్ గా అయితే ఈ చిత్రం ఎంత వసూళ్లు రాబడుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా శ్రీదేవి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు