బజ్..”ఆదిపురుష్” ట్రైలర్ ఎప్పుడంటే.!

Published on Mar 23, 2023 12:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ఈ ఏడాది రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మొదటి రిలీజ్ చిత్రం “ఆదిపురుష్” కోసం తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా ప్రభాస్ శ్రీ రామునిగా కృతి సనన్ జానకి దేవి పాత్రలో నటించింది. అయితే ఈ భారీ సినిమా ప్రమోషన్స్ మరియు కొత్త అప్డేట్స్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇపుడు అయితే సినిమా ట్రైలర్ కి సంబంధించి ఇంట్రస్టింగ్ బజ్ తెలుస్తుంది.

మేకర్స్ అయితే ఈ సినిమా అవైటెడ్ ట్రైలర్ ని కాస్త ముందే ప్లాన్ చేయనున్నారట. సినిమా రిలీజ్ జూన్ లో ఉన్నప్పటికీ అంతకు ముందే మేకర్స్ ఈ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారట. దీనితో అయితే అన్ని భాషల్లో మే నెల లోనే ఈ ట్రైలర్ ఉంటుందని తెలుస్తుంది. బహుశా మే మధ్యలో ఈ ట్రైలర్ రావచ్చని టాక్. అక్కడ నుంచి ఇతర ఈవెంట్ లు ప్రమోషన్ లు అన్నీ ప్లాన్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :