“ఆదిపురుష్” అప్డేట్ వచ్చేది అప్పుడే.?

Published on Aug 7, 2022 8:01 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్నటువంటి సాలిడ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఈ భారీ సినిమా నుంచి ఇంకా కూడా ఎలాంటి సరైన అప్డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ లోనే ఉన్నారు.

మరి దీనితో అయితే వారు ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రీట్ అక్టోబర్ లోనే ఉంటుందని గట్టి బజ్ ఉండగా దానికి రిలేటెడ్ అప్డేట్ అయితే వచ్చే నెల సెప్టెంబర్ లోనే ఉండనున్నట్టుగా లేటెస్ట్ గా వినిపిస్తున్న కొత్త టాక్. మరి దీనిపై అయితే మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని అయితే దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :