తెలుగు స్టేట్స్ లో “కేజీయఫ్ 2” బుకింగ్స్ అప్పుడు నుంచే?

Published on Apr 8, 2022 1:00 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. పాన్ ఇండియా వీక్షకులు మళ్ళీ ఒక సీక్వెల్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఇదే అనేలా చేసింది. తారా స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు మేకర్స్ థియేటర్స్ లోకి తీసుకొని వస్తున్నారు.

అయితే అనూహ్యంగా ఈ సినిమాపై మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కన్నడ ఇండస్ట్రీకి ధీటుగా అంచనాలు నెలకొనడంతో ఇక్కడ కూడా ఆడియెన్స్ లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీనితో ఆన్లైన్ బుకింగ్స్ ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని అంతా ఆసక్తిగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మాస్ మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా బుకింగ్స్ ఆదివారం నుంచి గాని సోమవారం నుంచి గాని స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ప్రత్యేక ధరలు వచ్చే అవకాశం ఉందని అవి వచ్చాక స్టార్ట్ అవుతాయని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :