“అజిత్ 62” నుంచి అప్పుడు క్లారిటీ.!

Published on Feb 22, 2023 9:00 am IST

లేటెస్ట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యినటువంటి చిత్రాల్లో స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన సినిమా “తునివు” కూడా ఒకటి. మరి ఈ సినిమా అజిత్ కెరీర్ ఓ భారీ హిట్ గా నిలవగా ఈ సినిమా రీసెంట్ గా ఓటిటి లో కూడా వచ్చి అక్కడ కూడా సూపర్ హిట్ అయితే అయ్యింది. మరి ఈ సినిమా తర్వాత అయితే అంతా అజిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అజిత్ 62 సినిమా కోసం అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా కి దర్శకుడు విషయంలో ఆల్రెడీ కొంచెం సస్పెన్స్ నెలకొనగా ఈ సినిమాపై అయితే కంప్లీట్ క్లారిటీ ఈ మార్చ్ రెండో వారంలో రానున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఆల్రెడీ సినిమా ముహూర్తం అయితే కంప్లీట్ అయిపోగా సినిమాపై టైటిల్ సహా ఇతర డీటెయిల్స్ ని మేకర్స్ మార్చ్ రెండో వారం కి రివీల్ చేయనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి మూడు టైటిల్స్ ఆల్రెడీ పరిశీలనలో ఉన్నాయట. ఇంకా అనిరుద్ అయితే ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని భారీ లెవెల్లో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :