టాక్..”వీరమల్లు” షూట్ రీస్టార్ట్ అయ్యేది అప్పుడేనా.?

Published on Jan 22, 2022 12:03 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నా ఈ సినిమాపై భారీ స్థాయి అంచనాలు కూడా నెలకొనగా మేకర్స్ భారీ సెట్టింగ్స్ వేస్తూ షూట్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. రీసెంట్ గా ఒక భారీ సెట్ ని వేస్తున్నారని వచ్చిన వార్త కూడా బయటకొచ్చి వైరల్ కాగా ఇంకో పక్క షూటింగ్ పై కూడా కీలక టాక్ వినిపిస్తూ వస్తుంది.

ఈ లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే ఈ చిత్రం ఇప్పుడప్పుడే షూటింగ్ ని స్టార్ట్ చేసుకోదు అట. పరిస్థితులు అన్నీ చక్కబడ్డాకే షూట్ స్టార్ట్ చేస్తారట అయితే బహుశా ప్రస్తుత ప్లానింగ్ ప్రకారం మార్చ్ లో కానీ లేదా ఏప్రిల్ నుంచి కానీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి వేచి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :