“కల్కి 2” రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత.!

“కల్కి 2” రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత.!

Published on Jul 4, 2024 8:04 AM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం “కల్కి 2898 ఎడి”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సై ఫై మైథలాజికల్ యాక్షన్ డ్రామా వాటిని అందుకొని భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సహా కమల్, అమితాబ్ లాంటి దిగ్గజాలు కూడా పాలు పంచుకోగా ఇండియన్ సినిమా నుంచి మరో గ్రేట్ సినిమాగా ఇప్పుడు ఇది నిలిచింది.

అయితే ఈ చిత్రానికి కొనసాగింపుగా పార్ట్ 2 సహా కల్కి యూనివర్స్ ఉంటుంది అని నాగ్ అశ్విన్ కన్ఫర్మ్ చేసాడు. మరి పార్ట్ 1 లో ఉన్న ఎన్నో ప్రశ్నలకి పార్ట్ 2 లో సమాధానాలు దొరుకుతాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు పార్ట్ 2 దిగ్గజ నిర్మాత అశ్వినీదత్ సాలిడ్ అప్డేట్ అందించారు. పార్ట్ 2 బాలన్స్ షూటింగ్ ఈ ఏడాది చివరలో మొదలవుతుంది అని అలాగే వచ్చే ఏడాది మే, లేదా జూన్ లోనే సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిపారు. దీనితో మరో ఏడాదిలో సినిమా ఉంటుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు