టాక్..ఓటిటిలో “కాంతారా” వచ్చేది అప్పుడేనా.?

టాక్..ఓటిటిలో “కాంతారా” వచ్చేది అప్పుడేనా.?

Published on Oct 29, 2022 7:01 AM IST

కన్నడ ఇండస్ట్రీ నుంచి లేటెస్ట్ గా వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం “కాంతారా”. కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఓ డివోషనల్ హిట్ గా నిలిచింది. మరి ఇప్పటికీ కూడా థియేటర్స్ లో విజయవంతంగా సినిమా ప్రదర్శన తెలుగు, కన్నడ సహా హిందీ భాషల్లో నడుస్తూ ఉండగా మరో పక్క సినిమా ఓటిటి రిలీజ్ ఎప్పుడు అనేది కూడా ఆసక్తిగా మారింది.

అయితే ఇప్పుడు దీనిపై నిన్నే సినిమా నిర్మాత కార్తీక్ గౌడ ఓ క్లారిటీ కూడా ఒకటి ఇచ్చారు. మరి ఈ సినిమా నవంబర్ లో అయితే స్ట్రీమింగ్ కి రాదు కానీ డిసెంబర్ నుంచి అయితే స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్, అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి రావొచ్చని తెలుస్తుంది. మరి దీనిపై అయితే ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అయితే హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించగా తెలుగులో గీతా ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు