ఓటిటిలో “కార్తికేయ 2” రిలీజ్ మాత్రం అప్పుడే..!

ఓటిటిలో “కార్తికేయ 2” రిలీజ్ మాత్రం అప్పుడే..!

Published on Aug 3, 2022 7:00 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “కార్తికేయ 2” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ పై ఫైనల్ గా మేకర్స్ అయితే ఒక క్లారిటీ ని ఈరోజు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఆగష్టు 12 నుంచి ఆగష్టు 13కి ఈ సినిమాని వాయిదా వస్తున్నామని మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు.

ఇక దీనితో పాటుగా సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసారు. ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన 50 రోజులు తర్వాత మాత్రమే ఓటిటి లో అందుబాటులోకి వస్తుందని అందరికీ క్లారిటీ ఇచ్చారు. మరి ఓ సెక్షన్ ఆడియెన్స్ అయితే ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు