“మహేష్ 28” పై నెక్స్ట్ అప్డేట్ అప్పుడే.!

Published on May 20, 2023 2:01 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం కోసం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా అలాగే మహేష్ మరియు త్రివిక్రమ్ ల నుంచి హ్యాట్రిక్ సినిమాగా ఈ చిత్రం వస్తుండగా సాలిడ్ హైప్ ఈ సినిమాపై నెలకొంది. ఇక ఈ సినిమా గ్లింప్స్ పై మంచి అంచనాలు నెలకొనగా ఈ మాస్ గ్లింప్స్ ని అయితే మేకర్స్ ఈ మే 31న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే దీనికి ముందే మేకర్స్ మరో అప్డేట్ ని ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఈ మే 28న అయితే ఇది రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ అప్డేట్ ఏంటో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ వచ్చే ఏడాది జనవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

సంబంధిత సమాచారం :