చిరు నుంచి నెక్స్ట్ మెగా మాస్ ట్రీట్ ఇక అప్పుడేనా..?

Published on Jun 26, 2022 2:00 am IST

టాలీవుడ్ లెజెండరీ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో ఆల్రెడీ రెండు రీమేక్ చిత్రాలు “గాడ్ ఫాథర్” మరియు “భోళా శంకర్” లను చిరు శరవేగంగా ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసేస్తుండగా దర్శకుడు కే ఎస్ రవీంద్ర(బాబీ) తో తన కెరీర్ లో 154వ సినిమా చేస్తున్నారు.

మరి ఈ చిత్రం నుంచి నిన్ననే ఓ సాలిడ్ అనౌన్సమెంట్ రిలీజ్ పై రాగా ఇప్పుడు దీనితో పాటుగా త్వరలోనే అధికారిక టైటిల్ మరియు టీజర్ లను అతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టు మెన్షన్ చేశారు. అయితే ఇది పెద్దగా ఎవరు గమనించలేదు కానీ ఈ మాస్ అప్డేట్స్ అయితే మాత్రం ఇక నెక్స్ట్ మెగాస్టార్ బర్త్ డే కే వచ్చే అవకాశం ఉందని చెప్పాలి.

మరి దీనిపై అయితే క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :