పవన్ ఈ రీమేక్ లో అప్పుడు జాయిన్ కానున్నాడా.?

Published on May 7, 2022 6:04 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి మరో హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” తో ఇద్దరూ కూడా మంచి హిట్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక పవన్ అయితే బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుని మరిన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు.

అయితే పవన్ చేసిన గత రెండు సినిమాలు రీమేక్ లే కాగా మూడో రీమేక్ కి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసిందే. తమిళ హిట్ సినిమా “వినోదయ సితం” కి రీమేక్ గా పవన్ మరియు మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ లు ఈ సినిమాలో నటించనున్నారు.

అయితే ఈ సినిమాలో మళ్ళీ పవన్ తన గత ఓ రీమేక్ సినిమా “గోపాల గోపాల” లోలా మళ్ళీ మోడ్రన్ భగవంతుడుగా కనిపించనున్నారు. మరి ఇపుడు ఈ సినిమా షూట్ లో పవన్ ఎప్పుడు నుంచి పాల్గొననున్నారు అనేది తెలుస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే వచ్చే నెల నుంచే పాల్గొననున్నట్టు వినిపిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :