ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ రిలీజ్ మాత్రం అప్పుడే.!

Published on Feb 18, 2023 9:00 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆల్ మోస్ట్ వీటిలో షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యిపోవచ్చినవి కూడా చాలా ఉండగా వీటిలో సెన్సేషనల్ వరల్డ్ ప్రాజెక్ట్ చిత్రం “ప్రాజెక్ట్ కే” నుంచి మేకర్స్ ఈరోజే సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. దీనితో వరుసగా భారీ సినిమాలతో ట్రీట్ కి సిద్ధం అయ్యిన డార్లింగ్ మరో సినిమా రిలీజ్ పై అయితే లేటెస్ట్ బజ్ తెలుస్తుంది.

ఆ చిత్రమే దర్శకుడు మారుతీ తో ప్రభాస్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు మంచి స్వింగ్ లో నడుస్తూ ఉండగా తక్కువ సమయంలోనే ఈ సినిమా కంప్లీట్ అయిపోవచ్చినప్పటికీ మేకర్స్ అయితే ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది ప్రాజెక్ట్ కే తర్వాతే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. దీనితో ఈ ఏడాది రెండు సినిమాలు వచ్చే ఏడాది రెండు సినిమాలు ప్రభాస్ నుంచి ఉండబోతున్నాయి.

సంబంధిత సమాచారం :