చరణ్, నీల్ బిగ్ ప్రాజెక్ట్ మొదలు అప్పుడే..!

Published on Jun 8, 2021 7:01 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు అదిరే లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తో చేస్తున్న భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” అనంతరం మరో ఇండియన్ భారీ దర్శకుడు శంకర్ తో వారి కాంబోలో బెంచ్ మార్క్ సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ చిత్రం తర్వాత కూడా చరణ్ సినిమా ఫిక్స్ అయ్యిందని లేటెస్ట్ గానే బజ్ వచ్చింది..

అదే మరో లేటెస్ట్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో. వీరి కాంబోపై ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు కానీ సినిమా అయితే ఫిక్స్ అనే తెలిసింది. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న దానిపై కూడా ఇపుడు బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని నీల్ ఇప్పుడు చేస్తున్న సలార్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేసిన మరో భారీ చిత్రం అనంతరం స్టార్ట్ చెయ్యనున్నారట. మరి ఈ బిగ్ ప్రాజెక్ట్ పై ఎప్పుడు అధికారిక క్లారటీ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :