ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) అలాగే బాబీ డియోల్ (Bobby Deol) లాంటి బాలీవుడ్ స్టార్స్ తో దర్శకుడు బాబీ కొల్లి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కోసం తెలిసిందే. ఇది బాలయ్య కెరీర్ లో 109వ సినిమా (NBK 109) కాగా ఆల్రెడీ వచ్చిన గ్లింప్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ఎన్నికల్లో బిజీగా మారిపోవడంతో పెద్దగా అప్డేట్స్ సినిమా నుంచి రాలేదు. అయితే ఇప్పుడు ఫైనల్ గా బాలయ్య అభిమానులు కోరుకుంటున్న ఆ అప్డేట్స్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.
దీని ప్రకారం ఈ రానున్న జూన్ నెలలో బాలయ్య బర్త్ డే ఉండగా ఈ నెల మొదటి వారం 4 నుంచే అభిమానులకి సాలిడ్ అప్డేట్స్ మొదలు కావడం ఆరంభం అవుతుంది అట. దీనితో బాలయ్య 109 అలాగే బాలయ్య నెక్స్ట్ సినిమాలు సంబంధించి అప్డేట్స్ కూడా ఆ వారం నుంచే మొదలవుతాయని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ జూన్ 10 బాలయ్య బర్త్ డే ట్రీట్ లు కాస్త ముందు గానే రాబోతున్నాయి అని చెప్పవచ్చు.