మెగాస్టార్ చిరంజీవి ప్రేరణతో టాలీవుడ్ లోకి వచ్చిన దర్శకుల్లో కొల్లి బాబీ కూడా ఒకరు. మరి బాబీ అదే మెగాస్టార్ తో చేసిన సెన్సేషనల్ హిట్ సినిమా వాల్తేరు వీరయ్య తర్వాత మళ్ళీ బాబీ, చిరంజీవి కలయికలో మెగాస్టార్ 158వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరింత పవర్ఫుల్ సబ్జెక్ట్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
ఇక ఫైనల్ గా ఈ సినిమా షూట్ ఇంకా ముహూర్త కార్యక్రమాలుపై క్లారిటీ వినిపిస్తోంది. ఈ ఏప్రిల్ 20 నుంచి సినిమా ముహూర్తం ఇంకా సినిమా రెగ్యులర్ షూట్ కూడా అప్పుడు నుంచే మొదలు కానున్నట్లు టాక్. మరి ఈసారి బాబీ ఎలాంటి రీతిలో మెగాస్టార్ ని ప్రెజెంట్ చేస్తారో చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అని సమాచారం. అలాగే కన్నడ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
