“సలార్” హీట్ అప్పుడు నుంచి స్టార్ట్.?

Published on Mar 12, 2023 6:29 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి దీనిపై అంతకంతకు సాలిడ్ హైప్ పెరుగుతూ వస్తుండగా మేకర్స్ ఇప్పుడు షూటింగ్ ఆల్ మోస్ట్ ఫినిష్ చేసే స్టేజ్ కి వచ్చేసారు. ప్రస్తుతం భారీ ఫైనల్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తుండగా సలార్ నుంచి అయితే ఇక రెగ్యులర్ అప్డేట్స్ ఎప్పుడు నుంచి ఉండనున్నాయో తెలుస్తుంది.

ఈ సినిమా మేకర్స్ అయితే ఆదిపురుష్ రిలీజ్ వరకు అయితే ఎలాంటి అప్డేట్స్ ప్లానింగ్ చేయట్లేదట. జూన్ తర్వాత నుంచే జూలై నెల మధ్య నుంచి కానీ చివరి నుంచి గాని ఇక సలార్ హీట్ ని స్టార్ట్ చెయ్యనున్నారని తెలుస్తుంది. మరి ఈ భారీ సినిమాలో పృథ్వీ సుకుమారన్ కీలక పాత్ర చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :