యష్ నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యేది అప్పుడేనా.?

Published on May 24, 2022 5:36 pm IST


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర తన సినిమాలతో భారీ క్రేజ్ ని తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోస్ లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా ఒకడు. తన రెండు సినిమాలు “కేజీయఫ్ 1, 2” లతో రికార్డు స్థాయి వసూళ్లను కొల్లగొట్టి తనకి పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ని అయితే తాను తెచ్చుకున్నాడు.

అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఇలాంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత యష్ ముందు ఉన్న పెద్ద టాస్క్ నెక్స్ట్ సినిమాలు వీటిని ఎంత వరకు మ్యాచ్ చేస్తాయి అని? అయితే వీటిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది కానీ ఇపుడు అయితే యష్ నిస్ట్ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ పై క్రేజీ బజ్ బయటకి వచ్చింది.

ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తన సినిమా కేజీయఫ్ 2 రిలీజ్ అయ్యిన 50వ రోజు అంటే ఈ జూన్ 3న అనౌన్స్ అవ్వనుంది అని టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో అనేది తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే ఫ్యాన్స్ కూడా ఆయా సినిమా ఏంటి డైరెక్టర్ ఎవరు అనే వాటిపై మంచి ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

సంబంధిత సమాచారం :