ఇంట్రెస్టింగ్..”ఆచార్య” రిలీజ్ అక్కడ కూడా.?కారణం ఇదే

Published on Oct 14, 2021 7:07 am IST

ప్రెజెంట్ మన టాలీవుడ్ లో సాలిడ్ మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది అని చెప్పొచ్చు. యాదృచ్చికంగానే స్టార్ట్ అయ్యినా ఈరోజు రిలీజ్ అయ్యిన “మహా సముద్రం” నుంచి వచ్చే ఏడాది భారీ సినిమాలు “RRR”, “భీమ్లా నాయక్” వరకు కూడా ఉన్నాయి. మరి వీటితో పాటుగా మరో మెగా మల్టీ స్టారర్ సినిమా “ఆచార్య” కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన సినిమా ఇది.

అయితే పలు అనుమానాల మధ్య ఎట్టకేలకు ‘ఆచార్య’ సినిమా ఊహించని విధంగా ఫిబ్రవరి లో సెట్ చేశారు. అయితే అప్పుడెందుకా అని చాలా మంది డౌట్ పడ్డారు కానీ ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ మేటర్ వినిపిస్తుంది. “RRR” సినిమా రిలీజ్ అయ్యాక పాన్ ఇండియన్ లెవెల్లో చరణ్ మార్కెట్ డెఫనెట్ గా విస్తరిస్తుంది. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో..

ఇప్పటికే చరణ్ ని చూసి అప్పుడు ఎవరైతే విమర్శలు చేసారో వారితో మళ్ళీ ప్రశంసలు అందుకునేలా ఈ సినిమా చేసింది. అందుకే ఇప్పుడు “ఆచార్య” రిలీజ్ హిందీ మార్కెట్ లో కూడా ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే “రౌద్రం రణం రుధిరం” సినిమా తర్వాతనే “ఆచార్య” సినిమాను కావాలని ప్లాన్ చేశారట. మరి ఇందులో ఎంతమేర నిజముందో వేచి చూడాలి..

సంబంధిత సమాచారం :