మహేష్ అంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఇదేనా.!

Published on May 8, 2022 9:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన క్రేజీ సాలిడ్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం పై నిన్ననే ఎంతో గ్రాండ్ గా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ జరిపారు. అయితే ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పీచ్ చాలా స్పెషల్ గా మరియు ఎమోషనల్ గా సాగింది.

అయితే ఒక సందర్భంలో మహేష్ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. తనకి చాలా మంది దూరం అయ్యారు అని చెప్పిన మాట ప్రశ్నగా మారింది. అయితే దానికి కారణం తన సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు ని కోల్పోవడమే అని తెలుస్తుంది. అందువలనే తాను ఆ హ్యాపీ మూమెంట్ లో కూడా ఒక రకమైన భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :