“పుష్ప 2” ఎందుకు ఆలస్యం? రివీల్ చేసిన మేకర్స్

“పుష్ప 2” ఎందుకు ఆలస్యం? రివీల్ చేసిన మేకర్స్

Published on Jun 18, 2024 7:13 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో మంచి హైప్ ఉన్న కొన్ని సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప 2” కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా వాయిదా అంటూ వచ్చిన రూమర్స్ ని నిజం చేస్తూ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

అయితే దీనితో పాటుగా అసలు సినిమా ఎందుకు వాయిదా వేస్తున్నాం అనేది కూడా రివీల్ చేశారు. తాము సినిమా పూర్తి చేసేందుకు చాలా కష్టపడుతున్నామని ఒకపక్క షూటింగ్ మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నా కూడా ఈ చిత్రానికి ఈ ఆగస్ట్ 15 రిలీజ్ కి రాలేదని వస్తే బెస్ట్ క్వాలిటీ ఔట్ పుట్ తోనే రావాలని డిసైడ్ అయ్యామని అందుకే సినిమాని డిసెంబర్ రిలీజ్ కి ఫిక్స్ చేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ భారీ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు