ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా అలాగే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ నుంచి టీజర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు సినిమా విడుదల అవుతుందా అని రెబల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి అనుకున్న సమయానికి వీరి టీం అన్నీ ప్లాం చేస్తున్నప్పటికీ సకాలంలో షూటింగ్ అయితే జరుగుతుంది కానీ ఆ అప్డేట్స్ రావడం లేదు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం టీం అంతా గ్రాఫికల్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నారట. సాధ్యమైనంత త్వరగా సినిమాను విడుదల చెయ్యాలి అని అనుకునుటున్నట్టు తెలుస్తుంది.
అలాగే ఈ కారణం చేతనే ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ టీజర్ కూడా లేట్ అవుతుందట. మరి ఇవన్నీ పూర్తయ్యాకనే ఈ సినిమా టీజర్ మరియు విడుదల తేదీలపై ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఆ వండర్ ఫుల్ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
