స్ట్రీమింగ్ కి వచ్చేసిన ఈ ఏడాది బిగ్ హిట్ “రాజ రాజ చోర”

Published on Oct 8, 2021 10:00 am IST

ఎలాంటి కష్టం ఎదురైనా సరే థియేటర్స్ కి వచ్చే వీక్షకులు మాత్రం తగ్గరని ముఖ్యంగా మన తెలుగు ఆడియెన్స్ బాగా నిరూపించారు. మొత్తం భారత దేశంలోనే థియేటర్స్ లో అత్యధికంగా థియేటర్స్ లో సినిమా చూసేందుకు మనవాళ్లే ముందుకు వస్తారు సాహసం చేస్తారని ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని భారీ హిట్స్ చెబుతాయి.

అలా లాక్ డౌన్ తర్వాత వచ్చి మంచి రెస్పాన్స్ అందుకొని థియేటర్స్ కి భారీ లాభాలు అందించిన సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం “రాజ రాజ చోర” కూడా ఒకటి. హసిత్ గోలి తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ ఈ ఏడాది టాలీవుడ్ లో మంచి ప్రాఫిట్స్ ని అందించింది.

అయితే మరి ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి వీక్షకులను పలకరించేందుకు వచ్చేసింది. స్ట్రీమింగ్ యాప్ జీ 5 లో ఈరోజు అక్టోబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ హిలేరియస్ ఎంటర్టైనర్ ని అప్పుడు మిస్సయినా మళ్ళీ ఎంటర్టైన్ కావాలంటే జీ 5 నుంచి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.

సంబంధిత సమాచారం :