సినీ పరిశ్రమలకు ఈ సంవత్సరం అసలు కలిసొచ్చేలా కనిపించడం లేదు. సినిమాలు ఎప్పుడూ రిలీజ్ అవుతాయో తెలీదు. కానీ అందరి ఆశ మాత్రం దసరానే. కరోనా మహమ్మారి సమ్మర్ ని మింగేసి.. సమ్మర్ లో రావాల్సిన సినిమాలను అయోమయంలో పడేసింది. అయితే సమ్మర్ సీజన్ పోయినా.. మరో రెండు నెలలు కష్టాలు పడినా.. మళ్లీ మంచి రోజులు వస్తాయనుకుంటే కరోనా ఇప్పట్లో తగ్గేలా లేదు.
పైగా వచ్చే దసరా సీజన్ కూడా కరోనా దెబ్బకు సైడ్ అయిపోతే.. టాలీవుడ్ భారీ సంక్షోభానికి పునాదిగా మారిపోతుంది. మరి దసరా సీజన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలని కోరుకుందాం. కానీ వాస్తవ పరిస్థితులు సరిచూసుకుంటే అక్టోబర్ నాటికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేలా లేదు. దాంతో ఇప్పుడు ఒటిటి ప్లాట్ ఫామ్ ఒక్కటే ఆప్షన్ గా మారింది. కొత్త డైరెక్టర్స్ తో పాటు స్టార్ డైరెక్టర్స్ కూడా వెబ్ సిరీస్ లు చేసే ప్లానింగ్ లో ఉన్నారు.
