తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ చేసిన టాలెంటెడ్ నటుడు.!

Published on May 8, 2022 8:00 am IST

తమ మొదటి సినిమాలతోనే తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడం చాలా తక్కువ మందికి జరుగుతుంది. కానీ ఆ కొద్ది మందిలో తర్వాత నిలబడి మరిన్ని మంచి పాత్రలు పోషించడం కూడా అరుదు. మరి అలా మన టాలీవుడ్ లో తన నటనతో నిలదొక్కుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడే రాహుల్ రామకృష్ణ. ఎన్నో హిట్ సినిమాల్లో మంచి పాత్రలు చేసిన తాను తాజాగా భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” లో కనిపించి ఆకట్టుకున్నాడు.

అయితే ఈ నటుడు ఇప్పుడు తన పెళ్లిపై ఒక అనుకోని అనౌన్సమెంట్ ని ప్రకటించాడు. తన లైఫ్ పార్ట్నర్ తో ఒక ముద్దు పెట్టుకొని ఇద్దరి ఫోటో షేర్ చేసి తాము అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నామని తెలిపాడు. దీనితో ఈ పోస్ట్ కూడా వైరల్ గా మారగా తన ఫాలోవర్స్ అయితే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఆ పెళ్లి డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :