పవన్ “ఓజి” లో ఈ ఫేమస్ యంగ్ నటుడు.!

Published on Jun 10, 2023 7:05 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. పవన్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గానే మూడో షెడ్యూల్ స్టార్ట్ చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ షెడ్యూల్ తో అయితే ఓ యంగ్ అండ్ ఫేమస్ నటుడు ఈ సినిమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి నటుడు ఎవరో కాదు తన బేస్ వాయిస్ తో అటు తమిళ్ సహా మన తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి ఫేమ్ ఉన్న నటుడు అర్జున్ దాస్ అట. మరి ఈ నటుడు ఓజి సెట్స్ లో జాయిన్ అయ్యినట్టు గా కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే ఇతని వాయిస్ లో పవన్ పై సరైన ఎలివేషన్ పడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని పవన్ ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :