నేనూ మహేష్ గారి పెద్డ ఫ్యాన్ నే..యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

నేనూ మహేష్ గారి పెద్డ ఫ్యాన్ నే..యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Dec 3, 2022 9:00 AM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి అయితే ఎప్పుడు నుంచో అన్ బీటబుల్ క్రేజ్ ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తమ్మీద ఉంది. ఇక సినీ తారాల్లో కూడా మహేష్ కి మంచి ఫాలోయింగ్ ఉండగా లేటెస్ట్ గా అయితే ప్రముఖ ఫేమస్ సింగర్ కమ్ హీరోయిన్ షిర్లే షెటియా కూడా మహేష్ ఫ్యాన్ లిస్ట్ లో చేరినట్లు చెప్తుంది.

మరి లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మాట్లాడుతూ తాను కూడా మహేష్ గారికి పెద్ద ఫ్యాన్ నే అని ఆయన ఈ ఏడాది మరింత స్ట్రాంగ్ గా మారుతూ వచ్చారని.. వారి కుటుంబంకి తనకి మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నానని ఈ ఏడాది తన అభిమాన నటుడు ఎదుర్కొన్న కష్ట కాలంపై స్పందించింది. దీనితో ఈ ట్వీట్ మంచి వైరల్ గా మారగా మహేష్ ఫ్యాన్ లిస్ట్ లో అయితే కొత్త పేరు చేరింది. ఇక రీసెంట్ గానే స్వ యంగ్ బ్యూటీ హీరో నాగ శౌర్య తో కృష్ణ వ్రిందా విహారి అనే చిత్రంతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు